హైదరాబాద్, వెలుగు: నిమ్స్‌లో ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించాలని డాక్టర్లను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో నిమ్స్ వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆయన సమీక్షించారు. నిమ్స్ హాస్పిటల్స్ కు వచ్చే పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
నిమ్స్‌లో సరిపడా సర్జన్లు ఉన్నప్పటికీ, ఆపరేషన్ థియేటర్లు పరిమితంగా ఉండడంతో యూనిట్ల వారీగా రొటేషన్ పద్ధతిలో సర్జరీలు చేయాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల కొన్ని రకాల ఆపరేషన్ల కోసం పేషెంట్లు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రెండు హాస్పిటళ్లు సమన్వయంతో పనిచేసి పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. నిమ్స్ హెచ్వోడీలంతా టిమ్స్‌ను సందర్శించి, అక్కడ ఉన్న ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలని ఆదేశించారు.
